శ్రీవారి ఆశీస్సుల కోసం.. చంద్ర‌యాన్‌-3 ప్ర‌తిమ‌తో తిరుమ‌ల‌కు ఇస్రో చైర్మన్

-

చంద్ర‌యాన్‌-3 ప్రయోగాన్ని ఇస్రో శుక్రవారం చేపట్టనున్న విషయం తెలిసిందే. రేపు మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్ర‌యాన్‌-3ను ప్ర‌యోగించ‌నున్నారు. ఆ ప్ర‌యోగం స‌క్సెస్ కావాల‌ని కోరుతూ ఇవాళ ఉద‌యం ఇస్రో చీఫ్ ఎస్‌. సోమ‌నాథ్‌.. తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రయాన్-3 ప్రతిమతో ఆలయానికి వచ్చిన సోమనాథ్.. స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 రోవ‌ర్‌.. చంద్రుడిపై దిగుతుంద‌ని సోమనాథ్ తెలిపారు. ఆయనతో పాటు నేష‌న‌ల్ అట్మాస్పియ‌రిక్ రీస‌ర్చ్ ల్యాబ‌రేట‌రీ డైరెక్ట‌ర్ అమిత్ కుమార్ ప‌త్రా, చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టు డైరెక్ట‌ర్ వీరాముత్తు వేల్‌, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ క‌ల్ప‌నా కాళ‌హ‌స్తితో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు కూడా ఇవాళ శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. చంద్రుడి అధ్య‌య‌నం కోసం ఇస్రో ఈ మిష‌న్ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే చంద్రుడిపై స్పేస్‌ క్రాఫ్ట్‌ను దించ‌బోతున్న నాలుగ‌ో దేశంగా ఇండియా రికార్డు క్రియేట్ చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news