శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు.. చంద్రబాబు నాలుకను : భూమన

-

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఎలాంటి తప్పులు జరుగలేదని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు. ‘నేను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డులో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం’ అని ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు  భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదు.. చంద్రబాబు నాలుకను అని ఎద్దేవా చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. చాలా పెద్ద తప్పు అన్నారు. నేను, వై.వీ.సుబ్బారెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని.. అలా చేసుంటే సర్వనాశనం అయిపోతామన్నారు. లడ్డూ కల్తీ వివాదం పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version