రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తోన్న ఐటీ ప్రొఫెషనల్స్

-

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ప్రొఫెషనల్స్… హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తోన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు ఐటీ ప్రొఫెషనల్స్. ఈ తరుణంలోనే… భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ బోర్డర్ వద్ద పోలీసులు మొహరించారు.

IT Professionals coming to AP from Hyderabad to Rajahmundry Central Jail
IT Professionals coming to AP from Hyderabad to Rajahmundry Central Jail

హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీ చేస్తోన్నారు పోలీసులు. ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళుతున్నారు పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో అలెర్టైన పోలీసులు… వారిని ఏపీకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది. సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశముంది. ఇప్పటికే సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని.. 150 పేజీల కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. దర్యాప్తు వివరాలను సేకరించిన ఆధారాలను కౌంటర్ లో సీఐడీ పొందుపరిచింది.

Read more RELATED
Recommended to you

Latest news