ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రాబోయే ఎన్నికలకు ముందుగానే పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. వైసిపి యువ నేతలతో జరిగిన సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం చేయాలి. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ పెద్ద ఆయుధం. ఎవరికైనా అన్యాయం జరిగినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయాలి. నా పాదయాత్రలో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కలుస్తానంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ పెట్టిన సమయం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేసానని వైసిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు అండగా నిలబడితేనే లీడర్ అవుతారని తాడేపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు యువతకు ఉందని అన్నారు. సోషల్ మీడియా ద్వారా అన్యాయాలు, అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.