విజయసాయిరెడ్డికి బిగ్ షాకిచ్చారు జగన్. ఓటమి అనంతరం.. విజయ సాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గించారు. క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు లోక్ సభ, రాజ్య సభ సభ్యులు హాజరు అయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు జగన్.
ఈ సందర్భంగా ఎంపీల సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడుతూ….రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారన్నారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు జగన్. అయితే..విజయసాయి రెడ్డి కి ప్రాధాన్యత తగ్గించిన జగన్.. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బా రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో కేవలం రాజ్యసభ లో వైసిపి పక్ష నేతగా కొనసాగనున్నారు
విజయసాయి రెడ్డి.