పేదలకు గుడ్ న్యూస్.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ప్రారంభం

-

పేదలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండ్ల వద్దనే 7 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. డాక్టర్లు గ్రామాలకు వెళ్లడంతో ఏ గ్రామంలో ఎవరెవరికీ ఏ సమస్య ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రతీ మండలంలో రెండు పీహెచ్షీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు రెండు సార్లు వెళ్లి చెకప్ చేయాలని సీఎం సూచించారు. 

CM Jagan will launch the Jagananna health protection campaign

అంబులెన్స్ లో ఒక డాక్టర్, పీహెచ్సీలో మరో డాక్టర్ అందుబాటులో ఉంటాడు. ప్రతీ పేదవాడికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టుతెలిపారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ , ఆసరా అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 45 రోజుల పాటు ఆరోగ్య సేవలు.. ఆరోగ్య శ్రీ హాస్పిటల్ వద్దకు ఎలా వెళ్లాలి.. జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తరువాత ఇంటికి వస్తున్నారు. పేషెంట్ మందులు తీసుకునే పరిస్థితి ఉండదు. సురక్ష ద్వారా ఇలాంటి సమస్యలు రాకుండా ఈ కార్యక్రమం ద్వారా సహాయపడుతుంది. 

Read more RELATED
Recommended to you

Latest news