ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జగనన్న విద్యా దీవెన పథకం వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకువచ్చింది. కాగ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన దాని ప్రకారం… ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులను జమ చేసేది. కానీ ప్రస్తుతం ఈ పథకం వాయిదా పడటంతో ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు పడటం లేదు.
అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పధకం ప్రకటించిన దాని ప్రకారం.. ఈ రోజు ఈ పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించాలి. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య మంత్రి జగన్.. విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో జగనన్న విద్యా దీవెన పథకం తాత్కలికంగా వాయిదాద పడింది. కాగ ఈ పథకం అమలుకు కొత్త తేదీలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు.