ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపికి ప్రతిపక్ష హోదా రాదని.. ఆయన వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందనే పవన్ కామెంట్స్ ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్.. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యే కు తక్కువ అన్నారు. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారని ఎద్దేవా చేసారు.
డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ ది క్రిమినల్ మైండ్ అని.. ఆయనను కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ అని మేము కూడా అనొచ్చు. బాబాయ్ హత్య గురించి దాదాపు అందరికీ తెలుసు. ఇలా మాట్లాడటం పద్దతేనా..? గతంలో జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం, ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యే. జగన్ అసెంబ్లీ కి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి కదా అని నిలదీశారు మంత్రి నాదెండ్ల మనోహర్.