ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు అంటే సెర్ఫ్ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న 4569 మంది హెచ్ ఆర్ ఉద్యోగులకు బేసిక్ జీతం పై ఏకంగా 23% జీతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఆగస్టులోనే జీతాల పెంపు పై ఉత్తర్వులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా గెజిట్ లో కూడా స్పష్టం చేసింది. దీంతో ఈ నెల ఉద్యోగులకు కొత్త జీతాలు పడనున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల… ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలోనే 68 వేల టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. లక్ష 50వేల ఇండ్లను డిసెంబర్ చివరి నాటికి అందించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు.