సినిమా ఇప్పుడే మొదలైంది.. టికెట్ ఇవ్వకపోతే క్లైమాక్స్ లో చూపిస్తా – జలీల్‌ ఖాన్‌

-

సినిమా ఇప్పుడే మొదలైంది.. టికెట్ ఇవ్వకపోతే క్లైమాక్స్ లో చూపిస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ మాట్లాడుతూ…బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలి….ఇవాళ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్ అని తెలిపారు.

jaleel khan comments on tdp

పొత్తులో కావాలంటే వేరే చోట జనసేన టికెట్ తీసుకోవచ్చు అని.. మాకు ఉన్న సీట్లు తీసుకుని మైనార్టీల నోట్లో మట్టి కొడతారా అంటూ ఫైర్‌ అయ్యారు. ఎన్నికలప్పుడు వేరే వాళ్ళు టికెట్లను అడగటం సహజమని… పశ్చిమ టికెట్ మైనార్టీలకు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. చంద్రబాబు టికెట్ మాకు ఇస్తారనే నమ్మకం ఉంది…నాకు హెల్త్ బాలేదని చెప్పటం ఒక రూమర్ అని వివరించారు. ఆ మాట అన్న వాడు వస్తె ఒక్కటి పీకుతా వారం లెగడని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news