జనసేన పార్టీ అవకాశవాద, నీచ రాజకీయాలు చేయదని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఆదివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల ఇన్చార్జీలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు నాగబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడిని ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అన్యాయం అన్నారు. ఇలాంటి సమయంలో నైతిక మద్దతు ఇవ్వడం తమ బాధ్యత అన్నారు. నేతలందరూ ఇగోని వదిలి పెట్టాలని సూచించారు.
రాబోయే ఎన్నికలు జనసేనకు ఎంత కీలకమో అందరు గుర్తించాలన్నారు. రాబోయే ఎన్నికలలో జగన్ ని ఓడించేంతవరకు నేతలు ఎవరు విశ్రాంతి తీసుకోకుండా పనిచేయాలన్నారు. నేతలైన, క్యాడర్ అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూసే పని చేయాలన్నారు. టిడిపి తో కలిసి పనిచేసినా జనసేన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక రాబోయే ఎన్నికలలో తిరుపతి నుండి ఎవరు పోటీ చేస్తారనేది అధినేత నిర్ణయం తీసుకుంటారని.. త్వరలోనే రాయలసీమలోనూ వారాహి యాత్ర ప్రారంభిస్తామన్నారు. రాబోయే ఎన్నికలలో మన సత్తా చూపించకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.