త్వరలో ఫ్లిప్‌కార్డ్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌.. స్మార్ట్‌ఫోన్లపై 80 శాతం డిస్కౌంట్‌

-

వినాయకచవితి ఆ వెంటనే దసరా..కొన్ని రోజులకు దీపావళి.. ఇదంతా పండుగల సీజన్‌. ఆఫర్లు కూడా బోలెడు ఉంటాయి. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువులపై ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023ని నిర్వహించనుంది. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్‌ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ స్టాట్‌ అవుతుంది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందించనున్నారు.

 

స్మార్ట్‌ ఫోన్లపై హాట్‌ ఆఫర్స్‌..

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా కొత్త ప్రొడక్ట్స్‌ లాంచ్‌ చేయనున్నారు. ఈ సేల్‌లో ముఖ్యంగా యాపిల్‌, ఐకూ, వన్‌ప్లస్, సామ్‌సంగ్‌, షావోమీ వంటి బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. పలు బ్రాండ్స్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌పై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలుస్తోంది.

లాంచ్‌కు రెడీ అయిన కొత్త ప్రొడెక్ట్స్‌

క్యాష్‌బ్యాక్‌లు, నోకాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్స్‌ పొందే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ బిగ్ సేల్‌లో భాగంగా కొత్త ప్రొడక్ట్స్‌ లాంచ్‌ చేయనున్నారు. మోటోరోలా, వివో, సామ్‌సంగ్‌ బ్రాండ్స్‌ కొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఈ సేల్‌లో మోటోరోలో ఎడ్జ్‌ 40 నియో, వివో టీ2 ప్రో, సామ్‌సంత్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 2023 ఎడిషన్స్‌ లాంచ్‌ కానున్నాయి. వీటితోపాటు మోటీజీ54, గ్యాలక్సీ ఎఫ్‌34, రియల్‌మీ సీ 51, రియల్‌మీ 115జీతో పాటుగా మరిన్ని కొత్త స్మార్ట్ మొబైల్స్‌ను లాంచ్ చెయ్యనున్నారని తెలుస్తుంది.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ సభ్యులకు ఒకటి, రెండు రోజుల ముందే సేల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అదనంగా క్యాష్‌బ్యాక్‌తో పాటు డిస్కౌంట్స్‌ కూడా లభిస్తాయి. ఇక కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్స్ కొనేవాళ్లు రెడీ అయిపోండి మరీ.!

Read more RELATED
Recommended to you

Exit mobile version