దుర్గగుడి వెండి సింహాలలు మంత్రి వెల్లంపల్లి నివాసంలో.. జనసేన నేత సంచలనం ?

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పై సంచలన కామెంట్స్ చేశారు. దుర్గగుడిలో మాయమైన వెండి సింహాల విగ్రహాలు మంత్రి వెల్లంపల్లి నివాసంలో ఉన్నాయనే అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన వరుస ఘటనల తో మంత్రి పదవి పోతుందనే ఆందోళన ఆయనలో నెలకొందని తాంత్రిక పూజారులు‌ చేసిన సూచనల మేరకు రెండు‌ వెండి సింహాలను ఆయన పూజా గదికి తరలించారని ఆయన ఆరోపించారు.

వాటిని పెట్టుకుని పూజిస్తే మంత్రి కి మంచి జరుగుతుందని తాంత్రిక వేత్తలు చెప్పారని ఆయన అన్నారు. అందుకే ఈ.ఓ పై చర్యలు తీసుకోవడంలో మంత్రి వెనుకాడుతున్నారని ఆయన ఆరోపించారు. మాయమైన‌ వాటి స్థానంలో కొత్తవి చెయించి పెట్టాలనే ఇఓ మూడు రోజుల సమయం అడిగారని ఓ సంస్థలో తయారు చేసేందుకు ఆర్డర్ కూడా ఇచ్చారని ఆరోపించారు. అందుకే ఇఒ సురేష్ బాబు తప్పించి విచారణ చేస్తేనే అసలు వాస్తవం బయటకు వస్తుందని మహేష్ పేర్కొన్నారు.