మేం డోన్లే తెరిస్తే.. వైసీపీ పార్టీ ఖాళీ – జనసేన ఎమ్మెల్యే

-

జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకుని ఎవరు వైసీపీలో లేరు….మేం డోర్ లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని బాంబ్‌ పేల్చారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. త్వరలోనే డోర్లు ఓపెన్ చేస్తామని ప్రకటించారు. దొంగలు, దోపిడీ దారులకు మద్దతుగా నిలిచే నైజాం జగన్మోహన్ రెడ్డిది అన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్.

Janasena MLA Vamsikrishna Yadav made sensational comments

గుడ్ బుక్ అంటే వైసీపీ అధినేత కు అసలు తెలుసా….? అంటూ నిలదీశారు. నాలుగు నెలల్లో ప్రభుత్వం మీద కాదు జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీలో వ్యతిరేకత వస్తోందని తెలిపారు. లిక్కర్ స్కాం లో లోకల్ బాయ్ రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి బాధ్యులు అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని విచారిస్తే నిజాలు వెలుగు చూస్తాయని తెలిపారు. వేల కోట్ల రూపాయల అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version