కాకినాడ: వాలంటీర్ వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎలమంచిలి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లుగా జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారని.. వాళ్ళు కూడా హ్యూమన్ ట్రాకింగ్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ లో వాలంటీర్ల పై వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టామని తెలిపారు.
వాలంటీర్లకు తాము నైతికంగా మద్దతు ఇస్తామని అన్నారు. రాజకీయ అక్కసుతో వాలంటీర్లపై మాట్లాడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నబాబు. ఇంత కంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా..? అని నిలదీశారు. వాలంటీర్లు లేని రాష్ట్రాలలో హ్యూమన్ ట్రాకింగ్ ఎవరు చేస్తున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఉనికి కోసమే రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు.