TTD నూతన ఛైర్మన్గా జంగా కృష్ణమూర్తి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది. TTD చైర్మన్ YV సుబ్బారెడ్డి పదవికాలం ముగిస్తుండటంతో ఆ స్థానంలో MLC జంగా కృష్ణమూర్తిని నియమించాలని CM జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చేవారం టీటీడీ బోర్డుపై సమీక్షించి తుదినిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తోంది.
అలాగే పార్టీ పదవుల్లోనూ మార్పులు ఉంటాయట. ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో ఎంపీ విజయసాయి రెడ్డికి ఆదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాగా, రేషన్ తీసుకోకుంటే ఎక్కడ కార్డు రద్దు చేయడం లేదని పౌరసరాఫరాల శాఖ వెల్లడించింది. దీనిపై ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మవద్దని సూచించింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని… ఏటా జూన్, డిసెంబర్ నెల లో అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తామంది. తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమం లో వచ్చిన దరకాస్తులను పరిశీలించి… అర్హులకు కార్డులు ఇస్తామని వెల్లడించింది.