జగన్ ని ఒక్కరుగా ఎదిరించలేకనే పొత్తులతో వస్తున్నారు: మంత్రి జోగి రమేష్

జగన్మోహన్ రెడ్డిని ఒక్కరుగా ఎదిరించే ధైర్యం చంద్రబాబుకు, టిడిపికి లేదన్నారు మంత్రి జోగి రమేష్. జగన్ బలంగా ఉన్నారు కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. రేపు ఏదైనా తేడా జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్లు కాదు.. 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అయిన మనము ఓడిపోయినట్లు అన్నారు. బలహీనులైన మనల్ని జగన్ బలవంతుడిని చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా రాలేడు.. అతనికి కావాల్సింది కూడా పొత్తులేనని విమర్శించారు.

80 శాతం ఉన్న మనల్ని 20 శాతం ఉన్న మీరు ఓడించలేరని మనం నిరూపించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు ఏకతాటిపైకి రావాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పాలన నడుస్తోందన్నారు జోగి రమేష్. మన బలం చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా.. ఎంత మంది కలిసి వచ్చినా.. తల్లకిందులుగా తపస్సు చేసినా.. జగన్మోహన్ రెడ్డిని అంగుళం కూడా కదపలేని మనమంతా చెప్పగలగాలి అన్నారు.