పవన్‌ కళ్యాణ్‌ భారతీయుడు కాదు.. రష్యా దేశస్తుడు – ఏపీ మంత్రి

-

పవన్‌ కళ్యాణ్‌ భారతీయుడు కాదు.. రష్యా దేశస్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్. నిన్న పెడన సభలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు జోగి రమేష్ కౌంటర్‌ ఇచ్చారు. పెడనలో అటెన్షన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశాడని… సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్ళ తో దాడులు అని హడావిడి చేశాడని ఆగ్రహించారు. రెండు వేల మందితో దాడులు అన్నాడు…పవన్ కళ్యాణ్ సభకు రెండు వందల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

అవనిగడ్డ లో పవన్ ఫ్లాప్ షో అని.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అంటూ చురకలు అంటించారు. జనసేన – టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అని విమర్శలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కాం లో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు… జైల్లో ఉన్న దత్త తండ్రికి… పెడన ప్రజలు శాంతి కాముకులు అన్నారు.

అటువంటి ప్రజల పై ఆరోపణలు చేసినందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ది అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ భారతీయుడో, రష్యా వాడో తెలియదు…భారతీయులు, ఆంధ్ర వాళ్ళకు పాస్ పోర్ట్ అక్కర లేదన్నారు. రష్యా వాడికి మాత్రం పాస్ పోర్ట్ కావాల్సిందేనని పవన్‌ కళ్యాణ్‌ కు చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news