ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును టీడీపీలోకి రానిచ్చేది లేదు – టీడీపీ క్యాడర్‌

-

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలోకి వెళుతున్నారని సమాచారం వస్తోంది. అయితే.. దీనిపై జగ్గంపేట టీడీపీ కోఆర్డినేటర్ జ్యోతుల నెహ్రూ స్పందించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును టీ డీ పీ లోకి రానిచ్చేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. ఆయన పార్టీలోకి రావడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అభివృద్ధి జరగాలని చంటిబాబు అనుచరులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు.

Jyotula Nehru warns Jaggampet MLA Jyotula Chantibabu

చంటిబాబు చేరికకు సంబంధించి పార్టీ నాపై ఒత్తిడి తెస్తుందని నేను అనుకోవడం లేదని వివరించారు. నియోజకవర్గంలో రెండు పవర్ పాయింట్లు ఉండకూడదు…జగ్గంపేట కి ఆయన చేసింది ఏం లేదు అని ఆగ్రహించారు. ఒకవేళ ఆయన పార్టీలోకి వస్తే తర్వాత చంటి బాబుకు పదవి ఇస్తే నేను ఊరుకోను కదా అంటూ హెచ్చరించారు. నన్ను ఎవరు సంప్ర దించలేదు, జగ్గంపేటలో పార్టీ బలంగా ఉందని స్పష్టం చేశారు జగ్గంపేట టీడీపీ కోఆర్డినేటర్ జ్యోతుల నెహ్రూ.

Read more RELATED
Recommended to you

Latest news