నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు.. కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ,అమిత్ షా,రూపలాకి కృతజ్ఞతలు తెలిపారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఇవాళ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారని తెలిపారు. భవిష్యత్తులో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకం చేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరాను.

బీఆర్ఎస్  కే.ఏ. పాల్ ను చూసి భయపడుతుందని.. కేసీఆర్,కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు. అక్టోబర్ 2 న ప్రజాశాంతి పార్టీ సభకు జింఖానా గ్రౌండ్ లో కేసీఆర్ అనుమతి ఇవ్వలేదు అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి ప్రజాశాంతి పార్టీ సభలకు అనుమతి ఇవ్వడం లేదు.కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారు. మందుకొట్టి కొత్త మేనిఫెస్టో తెస్తా అంటున్నారు. మరో 6 లక్షల కోట్లు అప్పు చేస్తారా అని ప్రశ్నించారు. 8 సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయి. కాపు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కొనేసాడు. తెలంగాణ లో 119 స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ నుంచి పోటీ చేసేందుకు 3600 మంది పోటీకి అప్లై చేశారు. ప్రజాశాంతి ఐఏఎస్, ఐపీఎస్ లు రిటైర్డ్ అధికారులు పోటీకి సిద్ధంగా ఉన్నారు.  బీఆర్ఎస్ కాంగ్రెస్ లో టికెట్లు రాకపోతే రెబల్ కాకండి అందరు కలిసి అభ్యర్థిని నిర్ణయిద్దాం.

 

Read more RELATED
Recommended to you

Latest news