BREAKING : నేడు CBI విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. సిఆర్పీసి సెక్షన్ 160 క్రింద ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సిబిఐ.

సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని గతంలోనే పేర్కొన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇక విచారణకు ముందుగానే హైదరాబాద్ చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి…ఇవాళ సిబిఐ ముందు క్రిమినల్ ప్రొసీసల్ కోడ్ 160 ప్రకారం రాత పూర్వకంగా సిబిఐ ప్రశ్నలుకూ సమాధానం ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version