ఇంకా చాలా మంది అరెస్ట్ అవుతారు : కాకాణి గోవర్దన్

-

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో అవతవకలకు పాల్పడ్డారంటూ ఇవాళ ఉదయం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై ఖండించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం విజయవాడ చేరుకోనున్నారు.

చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కాకాని గోవర్థన్ స్పందించారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడటం వల్లనే సీఐడీ అరెస్టు చేసిందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారని.. తప్పు చేసిన వారెవ్వరూ వాస్తవాన్ని ఒప్పుకోరని పేర్కొన్నారు మంత్రి. ఈ కేసుకు సంబంధించి సీఐడీ వద్ద నిర్దిషటమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు మాత్రమే కాకుండా ఇంచా చాలా మంది అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాకాని గోవర్దన్.

Read more RELATED
Recommended to you

Latest news