పోలీసుల అదుపులో సిట్ కార్యాలయం

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ముఖ్యంగా చంద్రబాబు కి రిమాండ్ ఇవ్వాలని కోరనున్న సీఐడీ అధికారులు . చంద్రబాబును నేరుగా సిట్ ఆఫీస్ కి తరలించనున్నారు పోలీసులు. ఇప్పటికే పలు చోట్ల చంద్రబాబు కాన్వాయ్ ఆగింది. పోలీసుల అదుపులో తాడేపల్లి సిట్ కార్యాలయం. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడు సిట్ ఆఫీస్ లో విచారణ పూర్తయిన తరువాత కోర్టులో హాజరు పరచనున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు గుంటూరుకు చేరువలో ఉన్నారు. దాదాపు గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సివిల్ కోర్టు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 3వ అదనపు జిల్లా ఏసీబీ కోర్టు జడ్జీ ముందు హాజరు పరచనున్నారు. చంద్రబాబుకి బెయిలా ? జైలా అనే ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి కొద్దిసేపటి క్రితం ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. తన బాధలు చెప్పుకోవడానికే దుర్గమ్మ దగ్గరకు వచ్చానని అన్నారు. ఏపీ ప్రజల కోసం పోరాడుతున్న చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. తమ పోరాటానికి అందరూ మద్దతివ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news