గడ్కరీ ప్రారంభించాకే కనక దుర్గ ఫ్లైఓవర్ పై రాకపోకలకు అనుమతి !

గడ్కరీ ప్రారంభించాకే కనక దుర్గ ఫ్లైఓవర్ పై రాకపోకలకు అనుమతిస్తామని ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. ఎన్డీబీ నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ బిడ్డింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామన్న ఆయన విజయవాడ, వైజాగులో రేపటి నుండి సిటీ బస్సులు రన్ చేస్తున్నామని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి సీటీ బస్సులను తిప్పుతామని ఆయన అన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సిటీ బస్సులను నడపడం భారీగా నష్టం చేకూర్చే అంశంగా ఉంటుందని అయినా సరే కరోనా కారణంగా బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదని అన్నారు.

వృద్ధులని బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నామన్న ఆయన కొందరు అత్యవసర పరిస్థితులంటూ వృద్ధులు వస్తున్నారని అన్నారు. వృద్ధుల బస్ ప్రయాణాలను నిరుత్సాహాపర్చేందుకే బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా రద్దు చేశామన్న ఆయన సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింప చేస్తామని అన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా కారణంగా ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగిందని గడ్కరీ ప్రారంభించాకే ఫ్లైఓవర్ పై రాకపోకలకు అనుమతిస్తామని అన్నారు.