ఏపీకి కేంద్రం శుభవార్త…బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ !

-

ఏపీకి కేంద్రం శుభవార్త…బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. కడప బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్ లో రాయలసీమ కు పెద్దపీట కానుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 5200 కోట్లతో బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప జిల్లా మైలవరంలో 400 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.

Kadapa Battery Storage Electricity Project

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలో 1000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కుప్పం లో 100 మెగావాట్లు, గోదావరిలో 100 మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానుంది. కడప జిల్లా మైలవరంలో 400 మెగావాట్లు, కర్నూలు జిల్లా గని వద్ద 400 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news