నేడు సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి. వీరేశలింగం పంతులు 1984 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు అనే దంపతులకు జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా వారు కాగా.. కందుకూరి నుంచి వలస వచ్చి రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయితే నేడు ఆయన జయంతి సందర్భంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారికి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.
“మూఢనమ్మకాలపై, వితంతువుల పునర్వివాహం కోసం, స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘసంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు” అని ట్విట్ చేశారు సీఎం జగన్.
మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2023