సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు !

-

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ గా ఎదుర్కొంటామని తెలిపారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అని.. అన్ని ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించామని వెల్లడించారు.

గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ను దివాలా తీయించిందని ఫైర్‌ అయ్యారు. రూ. 20 వేల కోట్ల అప్పులు చేసింది, వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని… ఆ అప్పులన్నీ మేము తీర్చి, శాఖను మళ్లీ గాడిలో పెట్టామన్నారు. ధాన్యం సేకరణ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని.. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామని వివరించారు. కోటి 46 లక్షల మందికి మేము రేషన్ ఇస్తున్నామని… కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చాం, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామని వివరించారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version