రాగులు, జొన్నలు పండించే రైతులకు సబ్సిడీలు అందిస్తున్నామని చెప్పారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రేషన్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు మూడు కిలోల రాగులు, కిలో గోధుమపిండి పంపిణీకి పుంగనూరు నుంచి శ్రీకారం చుట్టారు.
అనంతరం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…పుంగనూరు లో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం గా ఉందని.. రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పని రాక్షసులను చూడలేదన్నారు. దేవుడి కృప అయన పై ఎప్పుడు ఉంటుందని.. ఇక్కడి నుండి గోధుమ పిండి, ఫర్టిఫైడ్ చెక్కి పంపిణీ ప్రారంభించడం గొప్పగా ఉందని తెలిపారు. పుంగనూరు మున్సిపాలిటీ నుండే ఈ కార్యక్రమం ప్రారంభించామని.. ఏడాదికి 240 కోట్లు ఈ కార్యక్రమం ఖర్చు అవుతుందననారు. రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని.. .తిరుమలలో తొలగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తే సిఎం వైఎస్ జగన్ అడ్డుకున్నారని వివరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.