వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా ఈ రోజు వెస్ట్ ఇండీస్ మరియు స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ ఇండీస్ బాధ్యతారాహిత్యంగా ఆడుతూ కేవలం 100 పరుగులు లోపే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బరిలోకి దిగిన వెస్ట్ ఇండీస్ మళ్ళీ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తోంది అని చెప్పాలి.ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని స్కాట్లాండ్ బౌలర్లను ఎదుర్కోలేక వికెట్లను ఇచ్చుకుంది వెస్ట్ ఇండీస్. వరుసగా చార్లెస్, సామర్ బ్రూక్స్, కింగ్, హోప్, పూరన్ మరియు మేయర్స్ లు అవుట్ అయ్యారు. దీనితో వెస్ట్ ఇండీస్ కనీసం పరుగులు అయినా దాటుతుందా అని సందేహం కలుగుతోంది.
వరల్డ్ కప్ క్వాలిఫైర్ 2023: పీకల్లోతు కష్టాల్లో వెస్ట్ ఇండీస్… బెంబేలేత్తిస్తున్న స్కాట్లాండ్
-