ఐటీ నోటీసుల పై చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదు : కారుమూరి వెంకట్ రెడ్డి

-

ఐటీ నోటీసుల పై చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదు అని ప్రశ్నించారు వైసీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకట్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవాలి.. బాబు జమానా అవినీతి ఖజానా అని అప్పట్లో కమ్యూనిస్టులు పుస్తకమే వేశారు. ఇప్పుడు నారాయణ, రామకృష్ణా ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు?? దత్తపుత్రుడుకి కూడా ఈ ముడుపుల్లో వాటా అందిందా? పురంధరేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. నోటీసులు తప్పు అయితే ఐటీ శాఖ, వార్తలు రాసిన పత్రికల పై పరువు నష్టం దావా వేయాలి అన్నారు.

చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఖాయం అన్నారు కారుమూరి వెంకట్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్ లండన్ కు కుటుంబంతో కలిసి వ్యక్తిగత పర్యటన పై వెళ్ళారు. ఆయన సొంత ఖర్చులతోనే వెళ్ళారు. స్పెషల్ ఫ్లైట్ కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి తీసుకోలేదు. ప్రతి అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version