భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది : రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మూడు రోజులు పర్యటన కోసం యూరప్ వెళ్లారు. అందులో భాగంగా మొదటి రోజైన గురువారం ఉదయం ఆయన బెల్జియంలోని బ్రస్సెల్స్ కు చేరుకున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యులతో సమావేశమైన అనంతరం అక్కడి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

భారత్ లో ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మన దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని అక్కడ భారత సంతతి నాయకులతో అన్నారు. భారత్ ను నడుపుతున్న వ్యక్తుల బృందం దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడి చేస్తోందనే భావన వ్యక్తమవుతోంది. ఈ పాయింట్ ను ఎవరూ మిస్ అవుతున్నారని నేను అనుకోవడం లేదు. ప్రజాస్వామిక పోరాటం మాదే. దాన్ని మేమే చూసుకుంటాం. మన సంస్థలపై దాడి ఆగుతుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

ఆర్టికల్ 370 కింద జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను రద్దు చేయడంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కశ్మీర్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్నారు. ఇది మనది తప్ప మరెవరి పని కాదని.. ప్రజాస్వామిక సంస్థలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను. కాశ్మీర్ సహా భారత్ లోని ప్రతి ప్రాంతానికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version