రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. తాజాగా మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం రోజున రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో ఆయణ్ను అధికారులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్యాహ్నం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన మొదట గురువారమే విచారణకు హాజరవుతానని సిట్ కు సమాచారం అందించారు. తీరా ఆ సమయానికి రాకుండా గౌర్హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల గురువారం రోజున విచారణకు రాలేకపోతున్నానని.. శుక్రవారం హాజరు అవుతానంటూ సిట్ కు ఆఖరి నిమిషంలో సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఇవాళ విజయ్ సాయిరెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.