కేశినేని నానికి కేశినేని చిన్ని స్ట్రాంగ్ కౌంటర్..!

-

కేశినేని బ్రదర్స్ నాని చిన్ని మధ్య డైలాగ్ వారు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటీవల కేశినేని నాని టిడిపి అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని.. దమ్ముంటే బాబు తనపై విజయవాడలో పోటీ చేయాలని కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబును మూడు లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానని చాలెంజ్ చేశారు నాని. తాజాగా సోదరుడు నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని స్పందించారు.

తాజాగా కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబును విమర్శించే స్థాయి  నానికి లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నానికి డిపాజిట్ రాకుండా చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నాని పై మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.కేశినేని  నానికి దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలని సోదరుడు చిన్ని సవాల్ విసిరారు. కేశినేని సోదరుల మధ్య విమర్శలు సవాళ్లు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయవాడ టిడిపి ఎంపీ టికెట్ నిరాకరించడంతో పాటులో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కేసునేని నాని టిడిపికి గుడ్ భై చెప్పి అధికార వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version