జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు కేతం రెడ్డి. ఇటీవల జనసేన పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఘాటు వాక్యాలు చేశారు. జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నారంటూ సంచలన వాక్యాలు చేశారు. నాదేండ్ల మనోహర్ టిడిపి కోవర్టు అని… అతడి వల్ల జనసేన కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
అయితే…. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినానని తెలిపిన కేతంరెడ్డి… ఈసారి తన టికెట్ నారాయణకు ఇచ్చినట్టు అధిష్టానం చెప్పిందని పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశం మేరకు రేసు నుంచి తప్పకున్నా….నెల్లూరు ఎన్నికల సమన్వయకర్తగా అయిన పదవి అడిగిన ఇవ్వలేదని తెలిపారు. తాను పార్టీకోసం ఎంత కష్టపడినా సముచిత స్థానం కల్పించలేదని కేతంరెడ్డి ఆరోపించారు. తనలాంటి కష్టపడే కార్యకర్తలకు కాకుండా డబ్బాగాళ్లకు, డబ్బులున్నోళ్లకు మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పదవులు నాదెండ్ల మనోహర్ కే కావాలని….తనకు నచ్చిన వారికే ఇచ్చుకుంటాడని కీలక ఆరోపణలు చేశారు.