ఏపీ సీఎం కీలక నిర్ణయం.. లోక్ సభలో టీడీపీ విప్ గా బాలయోగి తనయుడు..!

-

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు  తీసుకుంటున్నారు. లోక్ సభలో టీడీపీ విప్ గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాథుర్ ని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు.

ఇక  ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో హరీష్ ఎంపీగా గెలుపొందారు. గతంలో హరీష్ తండ్రి బాలయోగి లోక్సభ స్పీకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. లోక్ సభ స్పీకర్ గా బాలయోగి సభను హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీక్కి విప్ బాధ్యతలు అప్పగించడంతో తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. సీఎం చంద్రబాబు నిర్ణయం పై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక చాలా ప్రభుత్వ పరంగా చాలా మార్పులను తీసుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news