టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. వారి జీతాలు భారీగా పెంపు

-

మంగళవారం టీటీడీ పాలకమండలి భేటీ అయ్యింది. అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ పాలకమండలి. శ్రీవారి ఆలయ పోటు కార్మికుల జీతాలను 10 వేల చోప్పున పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే వాహన బేరర్లు, ఉగ్రాణంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ జీతాలు పెంచుతూ నిర్ణయించింది. పెద్ద జీయ్యంగార్లు ఏడాదికి 60 లక్షలు, చిన్న జియ్యంగార్లుకు ఏడాదికి 40 లక్షల చోప్పున అదనంగా ఆర్దిక సహాయం అందించాలని నిర్ణయించింది.

హిందు ధార్మిక ప్రచారంలో భాగంగా పిభ్రవరి నెలలో మఠాధిపతులు, పిఠాధిపతుల సమావేశం నిర్వహిస్తామని తెలిపింది టీటీడీ. 28వ తేదిన 3518 మంది ఉద్యోగులుకు, జనవరి మొదటి మాసంలో 1500 మంది ఉద్యోగులుకు ఇంటి స్థలాలు కేటాయింపునకు నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులుకు కూడా ఇంటి స్థలాలు కేటాయించడానికి 350 ఏకరాల స్థల సేకరణ కోసం 85 కోట్లు కేటాయించింది టీటీడీ. కాంట్రాక్ట్ ప్రాతిపాదికిన పని చేస్తూన్న స్కిల్డ్, సెమి స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కళ్యాణకట్టలో విధులు నిర్వర్తించే ఫీస్ రెట్ ఉద్యోగుల జీతాలను 20 వేలకు పెంచింది. 14 కోట్ల రూపాయలతో గోగర్బం డ్యాం వద్ద భక్తుల సౌకర్యార్దం క్యూ లైన్ లను నిర్మించనుంది. తిరుపతిలో 209 కోట్లతో అచ్యుతం, 209 కోట్లతో శ్రీపథం అతిధి గృహాలు నిర్మించనుంది. అలాగే 17 కోట్లతో చెర్లోపల్లి శ్రీనివాసమంగాపురం రోడ్డుల అభివృద్ది పనులు, 15 కోట్లతో అలిపిరి వద్ద అభివృద్ది పనులుకు నిధులను కేటాయించింది.

2.87 కోట్లతో తిరుమలలో పోలిస్ క్వార్టర్స్ అభివృద్ది పనులు, శ్రీనివాసం వద్ద అభివృద్ది పనులుకు 2 కోట్లు కేటాయింపు, తిరుపతిలో పారిశుధ్య పనులు మేరుగుపర్చడానికి టెండర్లు ఆమోదం, జార్ఖండ్ లో 100 ఏకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గోనే భక్తులుకు దర్శన సౌలభ్యం కల్పిస్తూ ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version