చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవీయట్ పిటిషన్

-

ఏపీలో ఇప్పుడు చంద్రబాబు కేసుల వ్యవహారమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో ఊరట లభించకపోవడంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 3న దీనిపై విచారణ జరగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుపై నమోదైన కేసు విషయంలో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదననలు వినిపించారు. 

ఈ పిటిషన్ తొలుత జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, విచారణ నుంచి జస్టిన్ ఎస్వీ భట్టి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్లీ మెన్షన్ చేశారు. పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. సీజేఐ అక్టోబర్ 03కి వాయిదా వేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.చంద్రబాబు పై నమోదైన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ చంద్రబాబు పాత్రపై ఎన్నో వాదనలున్నాయి. కోట్ల కుంభకోణం చేశారని.. నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్ క్వాష్ చేసుకున్నారు. ఈ కేసులో మా వాదనలను మీ ముందుంచుతామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 

Read more RELATED
Recommended to you

Latest news