ఇస్రో మాజీ సీఎస్ సోమనాథ్ కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారునిగా నియమించింది. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పై సలహాలు ఇవ్వాలని కోరింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్ గా కేపీసీ గాంధీని నియమించింది.
అలాగే భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత, హస్తకళలకు డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్ రెడ్డిని ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్ గౌరవ సలహదారులుగా నియమిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ కేబినెట్ హోదాలో రెండేళ్ల పాటు కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.