విశాఖలో క్రికెట్ స్టేడియం వివాదం ముదురుతోంది. YSR పేరు తొలగింపునకు నిరసనగా వైయస్సార్సీపి ఆధ్వర్యంలో నిరసనలు జరుగనున్నాయి. తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని డిమాండ్ తో స్టేడియం దగ్గరకు చేరుకుంటున్నాయి వైసీపీ పార్టీ శ్రేణులు.

వైయస్సార్సీపి నిరసన నేపథ్యంలో స్టేడియం ను చుట్టూ పక్కల భారీగా పోలీసులు మోహరించారు. వజ్ర వాహనం సహా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపునకు వ్యతిరేకంగా జరిగే నిరసనలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొననున్నారు.