రాష్ట్రంలో జిల్లాలను విభజించి చాలా తప్పు చేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే జిల్లాలను మళ్ళీ కలిపే వాడిని అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేసారు. అలాగే ఇదే నా వైపు నుంచి విజ్ఞప్తి అంటూ ఓ ప్రస్తావనను సీఎం చంద్రబాబుకు ముందు పెట్టారు. నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే ముందు బ్రిజేష్ కుమార్ ని తప్పించాలి అని పేర్కొన్నారు.
బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పు పై నేను స్టే తెచ్చి 11 ఏళ్ళు అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతుంది. అయితే ఒక సమర్ధుడైన చంద్రబాబు రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావడం సంతోషం. ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. కేంద్ర సాయంతో వాటన్నింటినీ పరిష్కరించి ముందుకు సాగాలి. అలాగే అత్యంత ముఖ్యమైన రాజధాని, పోలవరం రెండు ప్రాజెక్టులు పూర్తి కావాలి అని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.