తెలంగాణ ఉద్యోగులను విడుదల చేసిన AP..!

-

తెలంగాణ ఉద్యోగులను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వామ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల విభజన సమయంలో తెలంగాణకు చెందిన కొంతమంది ఉద్యోగులను ఆంద్ర ప్రదేశ్ కు కేటాయించారు. దాంతో తెలంగాణ ఉద్యోగులను విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుతం ఎప్పటి నుండో కోరుతూనే ఉంది.

అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తాజాగా AP కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రివీల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ముందుగా వేరు వేరు విభాగాల్లో ఉన్న ఈ ఉద్యోగుల నుండి బదిలీ కోసం అంగీకారం తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. అయితే దీర్గకాలంగా పెండింగు ఉన్న ఈ ఉద్యోగుల బదీలపై నేడు ఉత్తర్వులు జారీ పట్ల ఏపీ జేఏసీ అమరావతి హర్షం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు కు ఏపీజెఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి వలిశెట్టి దామోదర్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

Read more RELATED
Recommended to you

Latest news