ఏపీ పీసీసీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డి ?

-

ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీకి కాస్త జవసత్వాలు కల్పించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ పదవీకాలం ముగియడంతో కొత్త పీసీసీ చీఫ్ ని నియమించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సోనియా, రాహుల్ లకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనను డిల్లీకి పిలిపించి మాట్లాడింది అధిష్టానం. గతంలో రఘువీరా.. ఆ తర్వాత శైలజానాథ్ పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కొన్ని ప్రెస్ మీట్లు తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. కొత్త పీసీసీ చీఫ్ గా ఓ రేంజ్ ఉన్న నేత అని పెడితే.. కాస్త హైప్ వస్తుందని హైకమాండ్ భావిస్తోంది.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఫెయిలై.. మళ్లీ కాంగ్రెస్ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో ఉన్న టాప్ లీడర్. ఆయనను పిసిసి అధ్యక్షునిగా చేస్తే ఎలా ఉంటుంది అనే మేధోమథనంలో ఉంది హైకమాండ్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పిసిసి పోస్ట్ తీసుకోవాలా వద్దా అన్న దానిపై కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో యాక్టివ్ గా లేరు. కానీ ఢిల్లీ స్థాయిలో పార్టీకి తెరవెనుక సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పిసిసి ఛీఫ్ గా బాధ్యతలు అప్పగించాలని ఆలోచనలో ఉంది హైకమాండ్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version