పవన్ కళ్యాణ్ గురించి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు జనసేన నేత కిరణ్ రాయల్. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై వైసీపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారన్నారు. ఇంట్లో వాళ్లపై నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా ? తాట తీస్తామని చెప్పారు.

24 గంటల్లో పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ పెట్టిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మేమే అధికారంలో ఉండి మళ్లీ మేమే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే బాగుండదన్నారు జనసేన నేత కిరణ్ రాయల్.