చంద్రబాబు గురించి టీవీలో వస్తే..ఛానల్ మారుస్తున్నా – కోమటిరెడ్డి

-

చంద్రబాబు గురించి టీవీలో వస్తే..ఛానల్ మారుస్తున్నా అంటూ సెటైర్లు పేల్చారు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనపై కోమటిరెడ్డి ఇవాళ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు ఎపిసోడ్ చూడటం లేదు…టీవీలో వచ్చినా.. ఛానల్ మారుస్తున్నా అంటూ ఎద్దేవా చేశారు. మా బాధలు మాకున్నాయి.. ఆయన గురించి నాకేందుకు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

komatireddy
komatireddy

కాంగ్రెస్‌ పార్టీలో చేరికల పై ఒకటో తేదీన హైకమాండ్ లో మీటింగ్ ఉంది…దాంట్లో మాట్లాడతానన్నారు. నాకు ఇప్పుడు నా జిల్లాలో ఎమ్మెల్యేలు గెలవడం ఎలా అనే దానిపైనే ఫోకస్‌ చేశానని చెప్పారు. కొత్త మనోహర్ రెడ్డి ఎవరో తెలియదని..ఆయన ఏం మాట్లాడిండో తెలియదని తెలిపారు. BRS ఎన్ని టికెట్లు అమ్ముకుందో చెప్పాలా…. హరీష్ హైట్ పెరిగిండు కానీ బుర్ర పెరగలేదని మండిపడ్డారు. Brs అంటే..బొందల రాష్ట్ర సమితి అని.. పార్టీ అంతర్గత అంశాలు ఢిల్లీలో మాట్లాడుకుంటామని పేర్కొన్నారు. ఇక్కడ మాట్లాడనన్నారు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news