డిసెంబర్ 4వ తేదీ లేదా 5వ తేదీన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి గేట్లు పగలగొడతానంటూ సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాజాగా ఫ్లై యాష్ అంశంలో తనను విమర్శించిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి బూతు పురాణంతో రెచ్చిపోయారు. ఆర్టిపీపీప ఫ్లైయాష్ వివాదంతో నాకేం సంబంధం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కోపం, తాపం, రోషం ఉన్నా… పక్కన పెట్టారని… నేను చంద్రబాబు అంత మంచి వాడిని కాదని తెలిపారు.
నాకూ కోపం, తాపం, రోషం ఉంది.. అలాగే కొట్టడం కూడా తెలుసు అని… గత వైసీపీ ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలను దారుణంగా వేధించారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం టిడిపి కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు… ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని తెలిపారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతానని… మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాడిపత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తున్నాడని ఆగ్రహించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా… మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ఊరు విడిపిస్తా అంటూ సవాల్ చేశారు.