కృష్ణలంక కార్పొరేటర్ కి క్లాస్ పీకిన మంత్రి

-

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణలంక కార్పొరేటర్ రామిరెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్ పీకారు. VVIP ఎంట్రీ గేటు నుంచి దర్శనానికి పోలీసులు రెవిన్యూ అధికారులు ఇస్తాను సారంగా తీసుకెళ్తున్నారని మంత్రి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు. చిన్న రాజగోపురము VVIP గేటు దగ్గర పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో తమ వారిని తీసుకుని గేట్లో నుంచి కార్పొరేటర్ రామ్రెడ్డి వెళ్తున్నారు. దీంతో రామ్ రెడ్డిని అడ్డుకొని బయటికి వెళ్దాం అన్నా మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. కృష్ణలంక కార్పొరేటర్ రామ్ రెడ్డి తమ వారిని తీసుకొని 500 క్యూ లైన్ లో వెళ్ళమన్న మంత్రి కొట్టే సత్యనారాయణ చెప్పారు. తప్పు చేయకుండా అడ్డుకోవాల్సిన మనమే తప్పు చేస్తామంటే ఎలా అంటూ మీడియా పాయింట్ లోనే కార్పొరేటర్ రామ్రెడ్డిని పిలిచి మరి కొట్టు సత్యనారాయణ మందలించారు.


రూల్ ఎవరికైనా రూలే అని మంత్రి చెప్పారు. 500 టికెట్లు ఉన్నాయని పంపమని అడిగినా మంత్రి వినలేదు. 500 క్యూ లైన్ లోనే కార్పొరేటర్ బంధువులను పంపాలని మంత్రి ఆదేశించారు మంత్రి ఘాటుగా హెచ్చరించడంతో 500 క్యూ లో దర్శనానికి కృష్ణలంక కార్పొరేటర్ రామ్రెడ్డి వెళ్లిపోయారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీ ప్రభుత్వం దగ్గరుండి మరి తాగిన ఏర్పాట్లను చేస్తుంది సామాన్యుల భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు అమ్మవారి దగ్గర అందరూ సమానమే అని ఎవరికి ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news