మేకర్స్ కీలక ప్రకటన: షారుఖ్ ఖాన్ “డుంకీ” రిలీజ్ లో తగ్గేదేలే !

-

షారుఖ్ ఖాన్ కు ఈ సంవత్సరంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మరో హిట్ పై కన్నేశాడు. ఈ సంవత్సరం చివర్లో రానున్న సినిమాపై ప్రేక్షకులకు భారీగా అంచనాలు ఉన్నాయి. షారుఖ్ నటించిన పఠాన్, జవాన్ లు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిర్వానీ తో “డుంకీ” చేస్తున్నాడు. ఇంతకు ముందు వచ్చిన కొని వార్తల ప్రకారం ప్రభాస్ సినిమా సలార్ డిసెంబర్ 23న రిలీజ్ ఉండడంతో, డుంకీ ని వాయిదా వేస్తున్నారని వైరల్ అయ్యాయి. కానీ ఈ సినిమా మేకర్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి డుంకీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

డుంకీ డిసెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ మార్కెట్ లో రిలీజ్ కానుండగా, పక్క రోజున డిసెంబర్ 22న ఇండియా లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ సాధించినట్లు అవుతుంది. మరి చూద్దాం ఏమీ జరగనుంది?

Read more RELATED
Recommended to you

Latest news