టీడీపీ పార్టీకి ప్రచారం చేస్తున్న కుమారి ఆంటీ

-

టీడీపీ పార్టీకి ప్రచారం చేస్తున్నారు కుమారి ఆంటీ. గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా – కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం కొనసాగింది. గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24వార్డుల్లో ప్రచారం చేశారు టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము, కుమారి ఆంటీ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే కలిగే అనర్ధాలను రాముతో కలిసి ప్రజలకు వివరించిన కుమారి ఆంటీ…..నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని వివరించారు.

Kumari aunty campaigning for TDP party

మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి-మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము అని కొనియాడారు కుమారి ఆంటీ. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే-రాము రియల్ లైఫ్ లో సేవా చేస్తున్నారన్నారు.

15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది….వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నానని వివరించారు కుమారి ఆంటీ. నా స్వస్థలమైన గుడివాడ మీద మమకారంతో, గుడివాడలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో, రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాను….గుడివాడ లో ఉపాధి అవకాశాలు, లేకపోవడంతో నాలాంటి వారు ఎందరో పక్క రాష్ట్రాలు వెళ్లి కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version