కురుపాం వైసిపి ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి బతుకమ్మ ఆడారు. హైదరాబాదులోని ఓ పార్కులో మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా పుష్పశ్రీవాణి ‘అమృత భూమి’ అనే సినిమాలో కూడా నటించారు.

ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్ర పోషించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా శ్రీ వాణి తన మంత్రి పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా..తెలంగాణ సంబురం బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులంతా బతుకమ్మ సంబురాలను అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. ప్రతి రోజు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి.. సాయంత్రం పూట అందరూ ఓ చోట గుమిగూడి బతుకమ్మ ఆడుతున్నారు. అయితే బతుకమ్మ పండుగ వస్తుందనగానే.. కొన్ని మ్యూజిక్ సంస్థలు పాటలు రిలీజ్ చేస్తుంటాయి.