ఎలక్షన్ల ముందు సత్తెపూస లెక్క మాట్లాడుతోందంటూ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. మోడీ గారి నుండి కిషన్ రెడ్డి గారి దగ్గర నుండి మా దాకా, అందరి మీద ఇష్టమొచ్చినట్టు అడ్డమైన భాష వాడి, ఇప్పుడు ఎలక్షన్ల ముందు సత్తెపూస లెక్క సుభాషితాలు చెప్తే సానుభూతి వస్తదనుకున్నవా!? తొక్క కూడా రాదు! అంటూ ఫైర్ అయ్యారు నిజామాబాద్ ఎంపీ అరవింద్.
ఇక అంతకు ముందు నిజామాబాద్‌లో తాను ఓడిపోయిన తర్వాత.. గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను మౌనంగా ఉంటూ తన కార్యక్రమాలేవో తాను చేసుకుంటూ వెళ్లానని కవిత అన్నారు. కానీ ఎంపీగా గెలిచిన వ్యక్తి తన బాధ్యతను.. స్థాయిని విస్మరించి ఇష్టం వచ్చినట్లు తనపై అనేక సార్లు వ్యక్తిగత దూషణ చేశారని తెలిపారు. రాజకీయపరంగా ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ.. ఇలా తనను అరవింద్ వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలే చెప్పాలని పేర్కొన్నారు. దేని గురించైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఎంపీ అరవింద్‌కు లేదని వ్యాఖ్యానించారు.